దేశంలో ప్రమాదకరమైన మంకీపాక్స్ పాజిటివ్ కేసులు *National | Telugu Oneindia

2022-07-24 197

Monkeypox In India:Delhi Man With No Travel History Tests Positive for Monkeypox,with this 4th Case registerd in Ind

దేశంలో ప్రమాదకరమైన మంకీపాక్స్ పాజిటివ్ కేసులు విస్తరించడం మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. దీని తరువాత మరో పాజిటివ్ కేసు కూడా అక్కడే రికార్డయింది. కాగా మంకీపాక్స్ పాజిటివ్ కేసులు విస్తరిస్తోన్న వేగాన్ని, దాని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 14,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళకే పరిమితమైందనుకున్న మంకీపాక్స్ పాజిటివ్ కేసులు ఇప్పుడు దేశ రాజధాని వరకూ పాకాయి. ఢిల్లీలో తొలి కేసు నమోదైంది.

#MonkeypoxInIndia
#GlobalHealthEmergency
#WHO